కందుకూరు జనసేన సమన్వయకర్తగా దేవళ్ళ భాస్కర్ రావు నియామకం


బాధ్యతలు అప్పగించిన పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన భాస్కర్ రావు
కందుకూరు: స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ ప్రక్రియలో భాగంగా కందుకూరు నియోజకవర్గ జనసేన స్థానిక ఎన్నికల కో-ఆర్డినేషన్ కమిటీ సమన్వయకర్తల్లో ఒకరిగా దేవళ్ళ భాస్కర్ రావు నియమితులయ్యారు. తనకు ఈ బాధ్యత అప్పగించిన జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
తన సేవలను గుర్తించి కీలక బాధ్యత అప్పగించడం పట్ల సంతోషం, గౌరవంగా భావిస్తున్నానని దేవళ్ళ భాస్కర్ రావు పేర్కొన్నారు. ఈ అవకాశం కల్పించిన జనసేన కేంద్ర కార్యాలయానికి, జిల్లా నాయకులకు, కందుకూరు నియోజకవర్గ పార్టీ నాయకులకు, జనసైనికులకు, వీరమహిళలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు కూటమి ధర్మానికి విఘాతం కలగకుండా స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయానికి తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో

జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి పనిచేస్తానని దేవళ్ళ భాస్కర్ రావు వెల్లడించారు.