చెక్క మొద్దులు కోసే మిషన్‌తో విద్యార్థినిపై దాడి చేసిన దుండగుడు?
తీవ్రంగా గాయపడిన గోపిక లక్ష్మి.. పాఠశాలలో భయాందోళనలు
రాప్తాడు:
రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న గోపిక లక్ష్మి అనే విద్యార్థినిపై ఓ వ్యక్తి చెక్క మొద్దులు కోసే మిషన్‌తో దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనలో విద్యార్థిని తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
విద్యార్థినిపై జరిగిన దాడితో పాఠశాల ప్రాంగణంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దాడికి గల కారణాలు, నిందితుడి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Social Plugin