తేదీ: 31-10-2026
బైకులపై వెంబడించి.. బస్సు నుంచి కిందకు దించి చితకబాదిన యువకులు...
అన్నమయ్య జిల్లా:
ఆర్టీసీ బస్సు ఆపలేదన్న కారణంతో ఓ బస్సు డ్రైవర్‌పై యువకులు దాడికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది.
బెంగళూరు నుంచి కదిరికి వస్తున్న ఆర్టీసీ బస్సును మద్దయ్యగారిపల్లిలో ఆపాలని కొందరు యువకులు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ బస్సును ఆపకపోవడంతో ఆగ్రహించిన యువకులు బైకులపై బస్సును వెంబడించారు.
అనంతరం డ్రైవర్‌ను బస్సు నుంచి కిందకు దించి దారుణంగా దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడైన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు విశ్వనాథ్, రాము, మధుకుమార్ అనే వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు....
Social Plugin