హర్యానా | అక్టోబర్ 31, 2026
పంచకులాలోని సంస్కృతి మోడల్ స్కూల్లో ఘటన.. చిన్నారుల ప్రవర్తన, మానసిక పరిస్థితులపై ఆందోళన
హర్యానా: హర్యానా రాష్ట్రంలోని పంచకులాలో కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. సంస్కృతి మోడల్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న చిన్నారిపై అదే పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న బాలుడు దాడి చేసి దారుణంగా కొట్టినట్లు సమాచారం.
ఈ ఘటనతో పాఠశాలల్లో చిన్నారుల భద్రత, విద్యార్థుల మధ్య ప్రవర్తన, వారి మానసిక పరిస్థితులపై ఆందోళన వ్యక్తమవుతోంది. చిన్న వయస్సులోనే ఇలాంటి దాడులకు పాల్పడటానికి గల కారణాలను గుర్తించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పిల్లల ప్రవర్తనలో మార్పులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించాలని, పాఠశాలల్లో చిన్నారుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
చిన్నారుల భద్రతపై పాఠశాల యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
Social Plugin