కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక హోమం


తేదీ: 31-10-2026 | ఒంగోలు





సంతపేట సాయిబాబా దేవస్థానంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు దంపతుల ప్రత్యేక పూజలు..

ఒంగోలు: ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ఆయన సతీమణి నాగ సత్యలత ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమం నిర్వహించారు.

ఒంగోలు నగరంలోని సంతపేట సాయిబాబా దేవస్థానంలో శనివారం వేద పండితుల ఆధ్వర్యంలో దంపతులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక హోమాన్ని నిర్వహించారు. ఎన్డీఏ కూటమి తరఫున మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నల్లమల్లి శ్రీశిల్పతో పాటు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులందరూ అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని స్వామివారిని ప్రార్థించారు.

అదేవిధంగా ఒంగోలు నగర ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని, నగరం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రేపు జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి మేయర్ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్పతో పాటు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులందరికీ ప్రజల ఆశీస్సులు లభించి ఘన విజయం చేకూరాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కుటుంబ సభ్యులు, జనసేన నాయకుడు రియాజ్, మేయర్ అభ్యర్థి నల్లమల్లి శ్రీశిల్ప కుటుంబ సభ్యులు, కూటమి పార్టీల కార్పొరేటర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.