రూ.70 లక్షల విలువైన గంజాయి పట్టివేత
ఆంధ్రప్రదేశ్: గంజాయి అక్రమ రవాణాపై అనకాపల్లి పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సుమారు రూ.70 లక్షల విలువైన 140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
కంటైనర్ లారీలో ఒడిశా నుంచి రాజస్థాన్‌కు గంజాయిని తరలిస్తుండగా పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు సమాచారం.
జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అనకాపల్లి ఎస్పీ తుహీన్ సిన్హా హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవడంతో పాటు నిందితుల ఆస్తులను జప్తు చేస్తామని స్పష్టం చేశారు.
నేషనల్ స్వాతంత్రం టీవీ
వార్తలో నిజం ప్రజల్లో నమ్మకం

Social Plugin