కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో మూలా నక్షత్రం సందర్భంగా భక్తులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రేపు తెల్లవారుజామున 2 గంటల నుంచే అమ్మవారి దర్శనాలను ప్రారంభించనున్నట్లు ఆలయ ఈవో శీనా నాయక్ తెలిపారు.
మూలా నక్షత్రం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయంలో అంతరాలయ దర్శనంతో పాటు అన్ని ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో వెల్లడించారు. భక్తులు ఆలయ అధికారుల సూచనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Social Plugin