చేవూరు రోడ్డుకు దిక్కెవరు? ప్రజల ప్రాణాలతో చెలగాటమా?





ప్రకాశం జిల్లా | గుడ్లూరు మండలం | చేవూరు


చేవూరు గ్రామ రోడ్డు దుస్థితిపై అధికారుల నిర్లక్ష్యమా? రామాయపట్నం పోర్టు యాజమాన్యం పట్టించుకోవడం లేదా? కాంట్రాక్టర్ బాధ్యత ఎక్కడ? అసలు ఈ రోడ్డును బాగు చేయించే బాధ్యత ఎవరిది?


గుంతలు, దుమ్ముతో నిండిన రోడ్డుపై ప్రయాణించాలంటేనే ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. నిత్యం రాకపోకలు సాగించే గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.


ప్రజల ఇబ్బందులు అధికారులకు కనిపించడం లేదా? రోడ్డు మరమ్మతులపై బాధ్యత వహించాల్సిన శాఖ ఏది? పోర్టు అధికారులు, కాంట్రాక్టర్ స్పందించరా? ప్రజల సమస్యను పరిష్కరించేందుకు ముందుకు వచ్చేది ఎవరు?


రోడ్డు సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, మరమ్మతులు చేపట్టి ప్రజలకు భద్రమైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.