తేదీ: 31-10-2026
డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆశీస్సులతో ఎన్నికల ప్రచారం నిర్వహించిన దామవరపు రాంబాబు..
సింగరాయకొండ:
మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (PAC) సభ్యులు, కొండేపి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆశీస్సులతో సింగరాయకొండ మండలం మూలగుంటపాడు ఎంపీటీసీ-2 అభ్యర్థిగా వైఎస్సార్సీపీ బలపరిచిన దామవరపు రాంబాబు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మూలగుంటపాడు పరిధిలో ఆయన పర్యటిస్తూ ప్రజలను కలుసుకుని ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల వైఎస్సార్సీపీ అధ్యక్షులు మసనం వెంకట్రావు, మూలగుంటపాడు గ్రామ అధ్యక్షులు మిరియం సుధాకర్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Social Plugin