వైసీపీకి షాక్.. టీడీపీలోకి అల్లూరు గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు!



ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సమక్షంలో పార్టీలో చేరిక...

ఒంగోలు: ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంగోలు నగరంలోని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నివాసంలో ఈ చేరికల కార్యక్రమం నిర్వహించారు.

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సమక్షంలో అల్లూరు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు సన్నిగిరి వెంకటస్వామి, లింగంగుంట పెరయ్య, మిట్నెసల శత్రుజ్ఞ తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య, గ్యానం సుబ్బారావు, నాలం నరసమ్మ, డాక్టర్ విజయ రాఘవరావు, శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, శ్యాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.