తుఫాన్ బాధితులకు అండగా ఎస్‌బీఐ.. సీఎం సహాయ నిధికి రూ.5.01 కోట్ల విరాళం!

 అమరావతి:


ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెక్కు అందజేసిన ఎస్‌బీఐ ఎండీ అమర రామ్మోహన్ రావు

అమరావతి: అర్నబ్ తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ముందుకొచ్చింది. బాధితులకు సహాయం అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5.01 కోట్ల భారీ విరాళాన్ని అందజేసింది.

అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ అమర రామ్మోహన్ రావు కలిసి రూ.5.01 కోట్ల చెక్కును అందజేశారు.

విపత్తు సమయంలో బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ఎస్‌బీఐ యాజమాన్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR)లో భాగంగా విపత్తు బాధితులకు అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల్ కుమార్, జనరల్ మేనేజర్ కుందన్ జ్యోతి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షేక్ షమీన్ భాను తదితరులు పాల్గొన్నారు.