31-10-2026
కందుకూరు అర్బన్:
రైతే రాజు అని చెప్పుకునే ప్రభుత్వాలు రైతులు ఆర్థికంగా దిగజారిపోతున్న సమయంలో ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. రైతు లేనిదే దేశం లేదని, రైతే దేశానికి వెన్నెముక అని ప్రసంగాల్లో చెబుతున్న నాయకులు, ఆచరణలో రైతుల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు.
పొగాకు సాగుకు పెట్టుబడులు పెరిగిపోతున్నప్పటికీ, పంటకు తగిన ధర లభించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పొగాకు రైతులకు న్యాయం చేయాలని, పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుల పోరాటానికి మద్దతు
రైతులు చేపట్టిన నిరసనకు ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నాయకుడు నేతి మహేశ్వరరావు మద్దతు ప్రకటించారు. రైతుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫోటో క్యాప్షన్: పొగాకు బోర్డు కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న రైతులు. పొగాకు బోర్డు అధికారులతో చర్చిస్తున్న రైతులు.


Social Plugin