గుడ్లూరు, అక్టోబర్ 6: గుడ్లూరు మండలం చెమిడిదపాడు గ్రామ బస్టాండు వద్ద నిర్మాణంలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ అభయాంజనేయ స్వామివారికి 58వ మంగళవారం వాలాగ్ర పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
హనుమత్ దీక్షా గురుస్వామి శ్రీ దుడ్డు హనుమత్ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్షా గురుస్వాములు ఆవుల వెంకటేశ్వర్లు, పెద్దారావు స్వామి, హనుమారెడ్డి, గుడ్లూరు గురుస్వాములు రమణరాజు, ఎయిర్‌టెల్ చిన్న తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాలూరు గ్రామానికి చెందిన గోసల వెంకారెడ్డి, కవిత, శ్రీనివాసులరెడ్డి, లక్ష్మీ ప్రసన్న, బత్తుల సురేష్‌రెడ్డి, అమూల్య, బొమ్మిరెడ్డి లీలా విశ్వనాధ్‌రెడ్డి, మౌనికతో పాటు పాలూరుకు చెందిన పాలూరి శివరామయ్య, మల్లీశ్వరి, రాంగోపాల్‌లు అన్నప్రసాద వితరణకు దాతలుగా వ్యవహరించారు.
అన్నప్రసాద వితరణ దాతలను ట్రస్టు అధ్యక్షులు ఆలూరి వెంకట హనుమంతరావు శ్రీరామ నామ శాలువాతో సత్కరించారు. కందుకూరుకు చెందిన నాగినేని కోటేశ్వరరావు కుమారుడు జస్వంత్ చౌదరి పుట్టినరోజు సందర్భంగా ఐదు కిలోల స్వీట్లను భక్తులకు పంపిణీ చేశారు.
ట్రస్టు అధ్యక్షులు ఆలూరి వెంకట హనుమంతరావు, గాయత్రి దంపతులు వాలాగ్ర పూజ సందర్భంగా స్వామివారికి గోధుమ రవ్వ పొంగలిని నైవేద్యంగా సమర్పించారు. వర్దినేని దేవి కుమార్తె యశ్విత స్వామివారికి సమర్పించిన రెండు బర్నర్ ఐరన్ స్టవ్‌కు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాదాన్ని తయారు చేశారు.
ఈ మంగళవారం నిర్వహించిన అన్నప్రసాదాన్ని మొత్తం 135 మంది భక్తులు స్వీకరించారు. స్వామివారికి వాలాగ్ర పూజతో పాటు శ్రీరామ, లక్ష్మి, ఆంజనేయస్వామి అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు. పంచముఖ ఆంజనేయ స్వామి కవచ పారాయణాన్ని ట్రస్టు అధ్యక్షులు హనుమంతరావు ఉభయదాతలతో కలిసి నిర్వహించారు.
మొట్టమొదటి అన్నప్రసాద వితరణ దాతలుగా పాలూరు గ్రామానికి చెందిన బుస్సారెడ్డి రోసిరెడ్డి, సుబ్బారెడ్డి పాల్గొని అన్నప్రసాద సేవా కార్యక్రమంలో సహకరించారు. కందుకూరులోని శ్రీ లక్ష్మీ వాచ్ అండ్ మొబైల్స్ అధినేత చక్కా చెన్నకేశవులు, ఆయన మిత్రులు నీలిశెట్టి రాజారావు కూడా అన్నప్రసాద సేవలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో వర్దినేని శేషమ్మ, రేణుక, వీరగంధం శ్రీనివాసరావు, సుజాత దంపతులు, వర్దినేని తిరుమలరావు, దేవి, యశ్విత, జొన్నలగడ్డ భారతి, కారసాల బ్రహ్మనాయుడు, జక్కంపూడి శ్రీనివాసులు, పద్మ దంపతులు, వర్దినేని జ్యోతి, జక్కంపూడి బాలేశ్వరరావు, విజయకుమారి దంపతులు, గ్రామ మాజీ సర్పంచ్ చిత్తారు హైమావతి, మల్లికార్జునరావు దంపతులు, కాకు కృష్ణవేణి, వర్దినేని రంగమ్మతో పాటు పలువురు హనుమాన్ భక్తులు పాల్గొన్నారు.
ఆలయ నిర్మాణ శిల్పి దుర్గాప్రసాద్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.



Social Plugin