పెద్దారవీడు: మండలంలోని మద్దలకట్ట గ్రామ పరిధిలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పొలాల్లో గోతం సంచిలో మద్యం బాటిళ్లు పెట్టుకుని విక్రయిస్తున్నట్లు పోలీసుల దృష్టికి రావడంతో తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో సదరు వ్యక్తి వద్ద నుంచి 52 క్వార్టర్ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Social Plugin