పొన్నలూరు ఎస్‌ఐ సత్యనారాయణకు జనసేన నాయకుల వీడ్కోలు



పొన్నలూరు, అక్టోబరు 4: బదిలీపై వెళ్తున్న పొన్నలూరు ఎస్‌ఐ పాలూరు సత్యనారాయణను జనసేన పార్టీ కొండపి నియోజకవర్గ మాజీ సమన్వయకర్త కనపర్తి మనోజ్‌కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.

ఈ సందర్భంగా మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. పొన్నలూరు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎస్‌ఐ సత్యనారాయణ కృషి చేశారని అన్నారు. రాత్రి గస్తీ, పండుగల సమయంలో బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రధాన కూడళ్లలో రహదారి భద్రత చర్యలు చేపట్టడంతో పాటు గంజాయి, అక్రమ మద్యం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. బాధితుల ఫిర్యాదులను స్వీకరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి తక్కువ కాలంలోనే ప్రజల అభిమానం పొందారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జనసేన నాయకులు పత్తిపాటి మాధవరావు, మిడసల అనిల్‌కుమార్‌, మహేంద్ర, గెరికే మహేష్‌, కాకాని ఆంజనేయులు, మాధవరావు, డేవిడ్‌, కందుకూరి కోటయ్య, సత్యాల సుబ్బారావు, హరిబాబు, శ్రీను, బందిల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.