కావలి: కావలి మున్సిపాలిటీ మాజీ చైర్మన్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ ప్రభాకర్ నాయుడు భౌతికకాయానికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్మన్‌గా కావలి ప్రజలకు ప్రభాకర్ నాయుడు అందించిన సేవలు ఎనలేనివని అన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందిస్తూ ప్రజా వైద్యుడిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
డాక్టర్ ప్రభాకర్ నాయుడితో తమకు ఎంతో అనుబంధం ఉందని, ఆయన ఇక తమ మధ్య లేకపోవడం తీవ్రంగా కలచివేస్తోందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం జరిగిన అంతిమయాత్రలో సోమిరెడ్డితో పాటు కావలి ఎమ్మెల్యే కావ్యా కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ పోతుగంటి అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.



Social Plugin