రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆందోళన



చేవూరు, అక్టోబరు 4: రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్ల ప్రక్రియ చేపట్టడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించనున్నట్లు సీఐటీయూ నాయకులు తెలిపారు.
అక్టోబరు 5న ఉదయం 10 గంటలకు చేవూరులో జరిగే ఆందోళన కార్యక్రమానికి గుడ్లూరు మండలంలోని కామ్రేడ్స్, కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.