హెచ్చరిక బోర్డులు పెట్టినా.. ఆగని నిర్మాణాలు!
సర్వే నంబర్ 596లో ఇష్టారాజ్యం? అధికారుల తీరుపై ప్రశ్నలు..
చేవూరు: ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టరాదంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, సర్వే నంబర్ 596 పరిధిలో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేసినా, వాటిని పట్టించుకోకుండా కట్టడాలు చేపడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫోటోలో స్పష్టంగా కనిపిస్తున్న హెచ్చరిక బోర్డులో సర్వే నంబర్ 596కు సంబంధించిన భూమిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని పేర్కొన్నప్పటికీ, అదే ప్రాంతంలో నిర్మాణాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
బోర్డులు పెట్టడమేనా.. చర్యలు ఎప్పుడు?
ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా, వాటిని ఉల్లంఘిస్తూ నిర్మాణాలు కొనసాగితే సంబంధిత అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదనే ప్రశ్నలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. సర్వే నంబర్ 596 భూమి హక్కులు, భూసేకరణ స్థితి, నిర్మాణాలకు ఉన్న అనుమతులపై రెవెన్యూ అధికారులు పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
హెచ్చరిక బోర్డులు ఉన్నా నిర్మాణాలు కొనసాగడం వెనుక ఎవరి అండదండలు ఉన్నాయనే విషయాన్ని అధికారులు తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
“డబ్బు కొట్టు.. భూమి పట్టు”
ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారుల చర్యలు ఎప్పుడు?



Social Plugin