మద్యం కోసం డబ్బులివ్వలేదని కూతురిపై తండ్రి దాడి!



తిరుపతిలో ఘటన.. 16 ఏళ్ల బాలికకు తీవ్ర గాయాలు

తిరుపతి: మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో కన్న కూతురిపైనే తండ్రి కర్రతో దాడి చేసిన ఘటన తిరుపతి నగరంలోని ఆటోనగర్‌ కృష్ణారెడ్డి నగర్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. లక్ష్మీ ప్రణీత (16) అనే బాలిక ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతూ తన అవ్వ, తాతల వద్ద ఉంటోంది. ఆమె తండ్రి శ్రీకాంత్‌ పెయింటర్‌గా పనిచేస్తుండగా, మద్యానికి బానిస కావడంతో భార్య అతడిని విడిచి వెళ్లినట్లు సమాచారం.

ఈ క్రమంలో మద్యం సేవించేందుకు డబ్బులు ఇవ్వాలని శ్రీకాంత్‌ తన కుమార్తెను డిమాండ్‌ చేశాడు. బాలిక నగదు ఇవ్వడానికి నిరాకరించడంతో సీల ఉన్న కర్రతో ఆమె తలపై దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడిన లక్ష్మీ ప్రణీతను చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.

తనతో పాటు అవ్వ, తాతలకు కూడా తండ్రి నుంచి ప్రాణహాని ఉందని బాలిక అలిపిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు అలిపిరి ఎస్‌ఐ ఆకుల నారాయణమూర్తి క్రైమ్‌ నంబర్‌ 354/2026 కింద కేసు నమోదు చేశారు.

నేషనల్ స్వాతంత్రం తెలుగు దినపత్రిక | NIS TV
తేదీ: 31-10-2026