తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారి అదృశ్యం.. ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు యువకులపై అనుమానం
గుంటూరు, అక్టోబర్ 31:...
గుంటూరు నగరంలో రెండు నెలల పసికందు అపహరణ ఘటన కలకలం రేపింది. లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటుకూరు రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
పాత సామాను సేకరించే దుకాణం ఎదుట తల్లితో కలిసి నిద్రిస్తున్న రెండు నెలల పసికందు కనిపించకుండా పోయింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు యువకులు చిన్నారిని అపహరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చిన్నారి అదృశ్యమయ్యే ముందు సదరు యువకులకు, బాధితులకు మధ్య గొడవ జరిగినట్లు స్థానికంగా సమాచారం వినిపిస్తోంది. పసికందు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు లాలాపేట పోలీసులను ఆశ్రయించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తూ, పసికందు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
రెండు నెలల చిన్నారి అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, చిన్నారి ఆచూకీ పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది..
Social Plugin