డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.29.17 లక్షల మోసం.. ఇద్దరు అరెస్ట్!
హైదరాబాద్‌లో రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించి రూ.29.17 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు.
ఢిల్లీ పోలీస్, సీబీఐ, ఈడీ అధికారులమంటూ నకిలీ గుర్తింపులతో బాధితుడిని భయపెట్టిన ముఠా.
రూ.6.8 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఇరికిస్తామంటూ బెదిరింపులు.
వెరిఫికేషన్ పేరుతో బాధితుడు, ఆయన కుమార్తె నుంచి డబ్బులు బదిలీ చేయించుకున్న నిందితులు.
హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల చేతికి చిక్కిన అమీర్‌పేటకు చెందిన ఇద్దరు నిందితులు.
మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు గుర్తింపు.
మ్యూల్ బ్యాంకు ఖాతాలు, చెక్కులు, USDT క్రిప్టో లావాదేవీల ద్వారా డబ్బు మళ్లించినట్లు పోలీసుల విచారణలో వెల్లడి.

Social Plugin