ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు యువకులు మృతి!
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గంగాధర నెల్లూరు మండలంలోని టానా జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులు తాళంబేడు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు చేపట్టారు.
NIS TV – నేషనల్ స్వాతంత్రం టీవీ వార్తలో నిజం… ప్రజల్లో నమ్మకం

Social Plugin