మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు
మాలకొండ: వలేటివారిపాలెం మండలంలోని మాలకొండపై కొలువుదీరిన శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామిని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శనివారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వర్షాలు సమృద్ధిగా కురిసి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. అంతకుముందు ఆలయ అధికారులు, సిబ్బంది ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం కొండపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, వసతుల గురించి ఎమ్మెల్యే భక్తులను అడిగి తెలుసుకున్నారు. అన్నప్రసాదం తయారీ కేంద్రాన్ని పరిశీలించి, భక్తులకు అందిస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. అలాగే కొండపై కొనసాగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించి, వాటి పురోగతిని తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వలేటివారిపాలెం మండల టీడీపీ అధ్యక్షుడు మాదాల లక్ష్మీనరసింహం, పార్టీ నాయకులు ప్రగడ శ్రీనివాసులు, కామినేని అశోక్, శనివారపు మాల్యాద్రి, ప్రగడ మోహన్, కూడలి భాస్కర్ తదితరులు ఎమ్మెల్యే వెంట ఉండి స్వామివారిని దర్శించుకున్నారు.
Social Plugin