ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల



ఈ నెల 26 నుంచి నవంబర్ 9 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం

హైదరాబాద్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 26 నుంచి నవంబర్ 9వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ఆలస్యంగా ఫీజు చెల్లించే విద్యార్థులకు రూ.2,000 అపరాధ రుసుముతో డిసెంబర్ 9 నుంచి 14వ తేదీ వరకు అవకాశం కల్పించారు.

ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి. ఫస్టియర్ రెగ్యులర్, సెకండియర్ జనరల్ ఆర్ట్స్ విద్యార్థులకు పరీక్ష ఫీజును రూ.540గా నిర్ణయించారు. సెకండియర్ జనరల్ సైన్స్‌తో పాటు ఫస్టియర్, సెకండియర్ ఒకేషనల్ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.890గా ఖరారు చేశారు.

విద్యార్థులు నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించి, చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

నేషనల్ స్వాతంత్రం టీవీ వార్తలో నిజం ప్రజల్లో నమ్మకం