చాకిచెర్లలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం



జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి

ఉలవపాడు, అక్టోబర్ 30:

ఉలవపాడు మండలం చాకిచెర్ల పంచాయతీ పరిధిలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు శుక్రవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చాకిచెర్ల, అంకమ్మపాలెం, చిన్నపట్టపుపాలెం, శ్రీరామపురం, ఎస్టీ కాలనీ ప్రాంతాల్లో ఆయన పర్యటించి ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా జనసేన పార్టీ తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగోతు నటరాజ్, తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాటితోటి శిరీషలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రజలను కోరారు.

చాకిచెర్లలో రూ.9.5 లక్షలతో చెరువులు, కాలువల అభివృద్ధి పనులు చేపట్టినట్లు, తాగునీటి సరఫరా, చెత్త సంపద కేంద్రం వంటి పనుల కోసం రూ.30 లక్షలు ఖర్చు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

రెండేళ్ల క్రితం తాను ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు మత్స్యకారుల కాలనీల్లో కనీస మౌలిక వసతులు లేక పరిస్థితి దారుణంగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్ని కాలనీల్లో సీసీ రోడ్లు, విద్యుత్ స్తంభాలు, శ్మశానాల అభివృద్ధి, తాగునీటి పైపులైన్ల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి పనులు చేయించినట్లు వివరించారు. మిగిలిన పనులన్నింటినీ రాబోయే రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

మత్స్యకార కాలనీల్లో ఇళ్ల స్థలాల సమస్య ఉందని, ఎన్నికలు పూర్తయిన వెంటనే ప్రతి ఒక్కరికీ పట్టాలు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు మిరియం మల్లికార్జున, మండల ప్రధాన కార్యదర్శి సుదర్శి శ్రీనివాసులు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బుచ్చయ్య గుప్తా, టీడీపీ నాయకులు ఎందేటి శ్రీను, సాంబయ్య, యలమంద, సుబ్బారావు, రవి, పోతురాజు, రఘురామయ్య, వెంకటేశ్వర్లు, ప్రసాదు, పున్నేపల్లి పేరయ్య, కోటేశ్వరరావుతో పాటు పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.