తేదీ: 31-10-2026
వలేటివారిపాలెం:
వలేటివారిపాలెం మండలంలో జడ్పీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సహకారంతో జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో ఉన్న కోరుకొండ అంజిబాబు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
మండలంలోని కాకర్లపాలెం, అమ్మపాలెం, చెర్లోపాలెం గ్రామాల్లో ఆయన పర్యటిస్తూ ఓటర్లను కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పేద ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావిస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి అండగా నిలబడతానని అంజిబాబు తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


Social Plugin