చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. మరో ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ హెచ్చరికలు వెల్లడిస్తున్నాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా, మరో ఆరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ప్రాంతాలు: చిత్తూరు, పుత్తూరు, సత్యవేడు, శ్రీసిటీ, తడ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఎల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు: గుంటూరు, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ సమాచారం సూచిస్తోంది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో ఉండకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఉన్నవారు సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచిస్తున్నారు. అధికారిక వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలి.
NATIONAL SWATANTRAM TV వార్తలో నిజం ప్రజల్లో నమ్మకం

Social Plugin