గొడుగు కాదు… విధ్వంస శక్తులకు అడ్డుకట్ట వేసే రక్షణ కవచం!



ఇది కేవలం వాన నుంచి కాపాడే గొడుగు మాత్రమే కాదు… అభివృద్ధికి అడ్డుపడే విధ్వంసక ఆలోచనలకు ఎదురుగా నిలిచిన పాశుపతాస్త్ర అడ్డుగోడ!

అర్బన్ తుఫాను అయినా, హుధూద్ తుఫాను అయినా… ప్రకృతి విపత్తులనైనా, రాజకీయ విధ్వంస శక్తులనైనా ఎదుర్కొనే ధైర్యం, ముందుచూపు ఉన్న నాయకత్వానికి ఈ గొడుగు ఒక ప్రతీకగా కనిపిస్తోంది.

నాడు శ్రీకృష్ణుడు తన చిటికెన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోకుల ప్రజలకు రక్షణ కల్పించినట్లుగా… నేడు రాష్ట్ర భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారనే సందేశాన్ని ఈ దృశ్యం గుర్తుచేస్తోంది.

గొడుగు పరిమాణం చిన్నదే కావచ్చు… కానీ దాని వెనుక ఉన్న రాజకీయ సందేశం మాత్రం పెద్దది!

నాయకత్వం అంటే కేవలం అధికారంలో ఉండటం కాదు… కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడం, అభివృద్ధి ప్రస్థానాన్ని ముందుకు నడిపించడం కూడా!