గిద్దలూరు: మున్సిపల్ ఎన్నికల వేళ గిద్దలూరులో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ జె.వి. నారాయణ సిద్ధమవుతుండగా, వైసీపీ తరఫున డాక్టర్ భూమా నరసింహారెడ్డి నామినేషన్ దాఖలుకు సిద్ధమయ్యారు.
ఇదే సమయంలో ఎమ్మెల్యే సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ అనూహ్యంగా నామినేషన్ బరిలోకి దిగేందుకు సిద్ధం కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. భారీ సంఖ్యలో అనుచరులతో నామినేషన్‌కు వెళ్లేందుకు ఆయన సన్నద్ధమవుతున్న నేపథ్యంలో గిద్దలూరులో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.
కూటమి పొత్తులో చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుంది? ఎమ్మెల్యే సోదరుడి రంగప్రవేశంతో కూటమి నేతల మధ్య ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అన్న అంశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
కృష్ణ కిషోర్ నామినేషన్ వ్యవహారం గిద్దలూరు రాజకీయాల్లో ఎలాంటి మలుపు తిప్పనుందో వేచి చూడాలి.

Social Plugin