🔴 వైఎస్ జగన్ ఎస్ఈసీకి ఫిర్యాదు

విజయవాడ: రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై
మాజముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

ఆదివారం విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఎన్నికల కమిషనర్‌ను కలిసిన జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. నామినేషన్లు దాఖలు చేయాలనుకునే ప్రతి అభ్యర్థికి అవకాశం కల్పిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా ఎలా అడ్డుకున్నారో ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు జగన్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఆదివారం గవర్నర్‌ను కూడా కలవనున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరగడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని, ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని డిమాండ్ చేశారు.