గుడ్లూరులో పోలీసుల ఫ్లాగ్ మార్చ్.. కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో పోలీసుల విస్తృత తనిఖీలు

 







గుడ్లూరు, అక్టోబర్ 30:

ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతా భావాన్ని కల్పించే లక్ష్యంతో ప్రకాశం జిల్లా గుడ్లూరు గ్రామంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

గుడ్లూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని ఎస్సైలు, పోలీసు సిబ్బందితో కలిసి గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. అనంతరం కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు. గంజాయి నిర్మూలనపై ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. యువత మాదకద్రవ్యాలకు బానిస కాకుండా అప్రమత్తంగా ఉండాలని, వాటి వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు వివరించారు.

ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు తోడ్పడాలని సూచించారు.

నేషనల్ స్వాతంత్రం తెలుగు దినపత్రిక | NIS TV

వార్తలో నిజం… ప్రజల్లో నమ్మకం