కూటమి అభ్యర్థులకు మద్దతుగా భారీ ర్యాలీ.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన...
ఉలవపాడు, అక్టోబర్ 30:
ఉలవపాడు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను, వ్యాపారులను కలిసి కూటమి అభ్యర్థులకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు.
ఉలవపాడులోని రిజర్వు కాలనీ, హైస్కూలు సంఘం, అంబేద్కర్ నగర్, వేణుగోపాలస్వామి ఆలయం ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించి ప్రజలతో మాట్లాడారు. జడ్పీటీసీ అభ్యర్థి సింగోతు నటరాజ్‌తో పాటు ఎంపీటీసీ అభ్యర్థులు దార్ల యలమందమ్మ, కత్తి కుమారి, పసుపులేటి రాము, మహమ్మద్ రఫీలను గెలిపించాలని కోరారు.
అలాగే ఆలయకోనేరు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఆర్యవైశ్యులు, పలువురు వ్యాపారులను కలిసి కరపత్రాలు పంపిణీ చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ ర్యాలీలో ఉలవపాడుకు చెందిన వివిధ వర్గాల ప్రజలు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధి జరిగేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం నష్టపోయిందని విమర్శించారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ఇవ్వాలని, నవంబర్ 5న జరగనున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు రాచగర్ల సుబ్బారావు, జనసేన సమన్వయకర్తలు దేవళ్ళ భాస్కర్, బుచ్చయ్య గుప్తా, గ్రామ టీడీపీ అధ్యక్షుడు చిరుతోటి గిరిబాబు, ఏఎంసీ డైరెక్టర్ అమ్మనబ్రోలు మాధవ, పార్టీ నాయకులు అంచుపోగు వాసు, చింతల సింగయ్య, దాసరి వెంకట్రావు, బొడ్డు ప్రసాద్, గంటా కృష్ణ, అమ్మనబ్రోలు రమేష్, కందగడ్ల బ్రహ్మయ్య, కరీం, తొట్టెంపూడి మాల్యాద్రి, వెల్డింగ్ ఖాదర్, బడితల శివప్రసాద్, ఓగుబోయిన యానాది, ఏజేస్, డాక్టర్ పవన్ తదితరులు పాల్గొన్నారు.
నేషనల్ స్వాతంత్రం తెలుగు దినపత్రిక | NIS TV
వార్తలో నిజం… ప్రజల్లో నమ్మకం

Social Plugin