స్థానిక సంస్థల ఎన్నికలపై ఎమ్మెల్యే ఇంటూరితో జనసేన నాయకుల చర్చ



కందుకూరు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో జనసేన పార్టీ సమన్వయకర్తలు మానేపల్లి బుచ్చయ్య గుప్తా, దేవళ్ల భాస్కర్ సమావేశమై చర్చించారు.


ఈ సందర్భంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలు, ఎన్నికల వ్యూహాలపై ఎమ్మెల్యేతో చర్చించినట్లు జనసేన సమన్వయకర్త మానేపల్లి బుచ్చయ్య గుప్తా తెలిపారు.


స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ చర్చ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.