దీపావళికి ముందు భారీగా అక్రమ దిగుమతులు.. DRI అధికారుల తనిఖీల్లో వెలుగులోకి...!
చెన్నై:- దీపావళి వేడుకలకు ముందు చెన్నై పోర్టులో భారీగా అక్రమంగా దిగుమతి చేసిన చైనా బాణసంచా పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు సుమారు రూ.12 కోట్ల విలువైన బాణసంచాను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
స్టేషనరీ, మెడికల్ గ్లవ్స్, ప్లాస్టిక్ వస్తువులు, గృహోపకరణాలుగా ప్రకటించిన కొన్ని కంటైనర్లను అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కంటైనర్లలోని ఇతర సరుకుల వెనుక భాగంలో బాణసంచాను అక్రమంగా దాచినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.
దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా బాణసంచాకు భారీ డిమాండ్ ఉండటంతో, అక్రమ దిగుమతిదారులు తప్పుడు వివరాలతో సరుకులను తరలించేందుకు ప్రయత్నించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న బాణసంచా విలువ సుమారు రూ.12 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అక్రమ దిగుమతుల వెనుక ఉన్న వ్యక్తులు, సంస్థలపై DRI అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Social Plugin