స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశీర్వదించండి: ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు...!
కందుకూరు, అక్టోబర్ 5: కందుకూరు మండలంలో పల్లెపండుగ 3.0 కింద చేపట్టనున్న మూడు ప్రధాన తారురోడ్ల నిర్మాణ పనులకు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం శంకుస్థాపన చేశారు.
పల్లెపండుగ 3.0లో భాగంగా చేపట్టనున్న పనులు:
అనంతసాగరం నుంచి ఓవీ రోడ్డు వరకు – రూ.70 లక్షలు
కొండికందుకూరు నుంచి కొష్టాలు మీదుగా కందుకూరు వరకు – రూ.1.97 కోట్లు
బలిజపాలెం నుంచి కమ్మవారిపాలెం వరకు – రూ.1.47 కోట్లు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కందుకూరు నియోజకవర్గంలో పల్లెపండుగ 3.0 ద్వారా తారురోడ్ల నిర్మాణానికి రూ.8 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, స్మశానవాటికలు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
కందుకూరు మండలంలోని అన్ని గ్రామాలకు రామతీర్థం నీటిని అందించే పనులు రూ.30 కోట్లతో కొనసాగుతున్నాయని, మరో ఐదారు నెలల్లో పనులు పూర్తయ్యే అవకాశం ఉందని ఎమ్మెల్యే తెలిపారు.
కొండికందుకూరు గ్రామంలో ఇప్పటికే రూ.30 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించామని చెప్పారు. తల్లికి వందనం పథకం ద్వారా 206 మందికి ఏటా రూ.30 లక్షలు, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 260 మంది రైతులకు రూ.52 లక్షలు అందిస్తున్నామని వివరించారు.
రాజకీయాలు, ఎన్నికలతో సంబంధం లేకుండా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమాల్లో ఏఎంసీ చైర్మన్ రాయపాటి సుభాషిని శ్రీనివాసరావు, మండల టీడీపీ అధ్యక్షుడు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు బైరపునేని రమణయ్య, తోకల రామకృష్ణ, ఈదర నరసయ్య, ఏఎంసీ డైరెక్టర్ మాదాల వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు బైరపునేని కోటయ్య, శ్రీకాంత్, రెబ్బవరపు మాల్యాద్రి, ఏకాంబరం నాగేశ్వరరావు, వెంకట్రావు, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు అల్లం వెంకటేశ్వర్లు, డీఈ మాలకొండయ్య, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Social Plugin