ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సభా వేదిక స్థల పరిశీలన




ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కొండపి నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ఈ నేపథ్యంలో మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర సహచరులతో కలిసి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామం వద్ద సభా వేదిక కోసం ప్రతిపాదించిన స్థలాన్ని పరిశీలించారు.

ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి సభా వేదిక ఏర్పాట్లు, ఇతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

అనంతరం నర్సింగోలు సమీపంలోని ప్రముఖ శనీశ్వర దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు


.