నవంబర్ 1 నుంచి కేంద్ర వాటా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి...!
అమరావతి, అక్టోబరు 4: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీ విధానంలో నవంబర్ 1 నుంచి కీలక మార్పు అమల్లోకి రానుంది. కేంద్ర ప్రభుత్వం అందించే పింఛన్ వాటాను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుండగా, రాష్ట్ర ప్రభుత్వం అందించే వాటాను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయనున్నారు.
ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలకు నెలకు రూ.4,000 పింఛన్‌లో కేంద్ర వాటా రూ.200, రాష్ట్ర వాటా రూ.3,800గా ఉంది. దివ్యాంగులకు రూ.6,000లో కేంద్ర వాటా రూ.300, రాష్ట్ర వాటా రూ.5,700గా ఉంది.
కేంద్ర వాటా బ్యాంకు ఖాతాలో జమ కావాలంటే లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్-బ్యాంకు ఖాతా అనుసంధానం లేకపోతే కేంద్ర వాటా జమ కావడంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందువల్ల పింఛన్‌దారులు ముందుగానే తమ బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Social Plugin