కనిగిరి: కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపు మేరకు, మండల పార్టీ అధ్యక్షుడు మడతల కస్తూరి రెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీటీసీ అభ్యర్థి మల్లెల ప్రవీణ్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు.

కనిగిరి మండలంలోని చిన్నఅలవలపాడు పంచాయతీ పరిధిలో ఉన్న మండాదివారిపల్లి, లింగారెడ్డిపల్లి, చిన్నఅలవలపాడు గ్రామాల్లో శనివారం ఉదయం ప్రచార కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా అభ్యర్థి మల్లెల ప్రవీణ్ కుమార్ ప్రతి ఓటరును ప్రత్యక్షంగా కలిసి నమూనా బ్యాలెట్ పత్రాలను అందజేశారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

అదేవిధంగా కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, గతంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలనను వివరించారు.

ఈ ప్రచార కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వార్తలో నిజం… ప్రజల్లో నమ్మకం