అన్నమయ్య జిల్లాలో దారుణం.. లాడ్జిలో మహిళ హత్య!



మదనపల్లె, అక్టోబర్ 15:

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ లాడ్జిలో మహిళ హత్యకు గురైంది. మహిళను బీర్‌ బాటిల్‌తో పొడిచి హత్య చేసినట్లు సమాచారం.

మృతురాలు కర్ణాటక రాష్ట్రం, కోలార్ జిల్లా, ముళబాగల్ ప్రాంతానికి చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనలో నిందితుడిగా నవీద్ భాష అలియాస్ నవీన్ పాషాను గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

NATIONAL SWATANTRAM TV వార్తలో నిజం.. ప్రజల్లో నమ్మకం