54 అడుగుల విరాట్ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి రూ.60 వేల విరాళం

National Swatantram TV...!

గుడ్లూరు, అక్టోబరు 3: గుడ్లూరు మండలం చిమిడితపాడు గ్రామ బస్టాండు సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న 54 అడుగుల విరాట్ ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి రూ.60 వేల విరాళం అందింది.

చెన్నై సుంకువారిసత్రానికి చెందిన సూర్యకుల గోత్రస్థులు భొమ్మిశెట్టి సురేష్, ధర్మపత్ని సుశీల, కుటుంబ సభ్యులు సౌమ్య, హర్షవర్ధన్‌లు కలిసి ఒక అడుగు విగ్రహ నిర్మాణానికి ఈ విరాళాన్ని శనివారం ఆలయ ప్రాంగణంలో ట్రస్ట్ అధ్యక్షుడు ఆలూరి వెంకట హనుమంతరావుకు ఫోన్‌పే ద్వారా అందజేశారు.

గతంలోనూ సుంకువారిసత్రంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణం కోసం భక్తుల నుంచి రూ.95 వేల విరాళాలను సేకరించి అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ‘శ్రీ రామ జయ రామ జయ జయ రామ’ అంటూ ఆలయం చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేశారు. తమ మొక్కు నెరవేరినందుకు స్వామివారికి కృతజ్ఞతలు తెలిపారు.

విరాళానికి రసీదు అందజేసిన అనంతరం సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార దేవత సమేత శ్రీ సువర్చలా పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆశీస్సులు కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ట్రస్ట్ అధ్యక్షుడు హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు.