గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారంపై అవగాహన...!
గుడ్లూరు: ఉలవపాడు ప్రాజెక్టు సీడీపీఓ మాధవీలత ఆదేశాల మేరకు గుడ్లూరు మండలంలోని తేట్టు సెక్టార్ పరిధిలోని మొండి వారిపాలెం గ్రామ అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రానికి హాజరైన గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, తల్లులకు పౌష్టికాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు మరియు పాల పదార్థాలను తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు.
అలాగే చిరుధాన్యాలైన సజ్జలు, రాగులు, జొన్నలతో పాటు క్యారెట్, బీట్‌రూట్, మునగాకు, కరివేపాకు వంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా వినియోగించాలని తెలిపారు. శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభించే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.
ప్రాంతీయ వంటకాలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, పిల్లల పోషణ, తల్లుల ఆరోగ్యం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కేంద్రంలో తాజా భోజనం, పోషణ, బాధ్యత, బాల ప్రేరణతో పాటు ప్రధానమంత్రి మాతృ వందన యోజన తదితర అంశాలను తల్లులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ప్రసాద్, ఉపాధ్యాయురాలు గంగాభవాని, ఆశ కార్యకర్త అనురాధ, అంగన్వాడీ కార్యకర్తలు వి.ఎం. అలివేలు, జి. మౌనిక తదితరులు పాల్గొన్నారు.





Social Plugin