మార్కాపురంలో డ్రగ్స్ నిర్మూలన, రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ...

National Swatantram tv..!

మార్కాపురం: డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడంతో పాటు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, మహిళల భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మార్కాపురం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించారు.

మార్కాపురం OSD నవజ్యోతి మిశ్రా IPS, SDPO నిమ్మగడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మార్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ విద్యార్థులు, యువతకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, వాటి ప్రభావానికి గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, వాహనదారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళల భద్రతపై కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ర్యాలీ ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.