మార్కాపురం నూతన డీఎస్పీగా నిమ్మగడ్డ సత్యనారాయణ బాధ్యతల

NATIONAL SWATANTRAM .TV:-

  మార్కాపురం సబ్‌ డివిజన్‌ నూతన డీఎస్పీగా నిమ్మగడ్డ సత్యనారాయణ శనివారం ఉదయం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆయన పుట్టపర్తి డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ, బదిలీపై మార్కాపురానికి వచ్చారు.

గతంలో నిమ్మగడ్డ సత్యనారాయణ మార్కాపురం డివిజన్‌లోని పెద్దారవీడు ఎస్సైగా కూడా విధులు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మార్కాపురం సబ్‌ డివిజన్‌పై ఆయనకు గత అనుభవం ఉంది.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. మార్కాపురం సబ్‌ డివిజన్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన పోలీస్‌ సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు కూడా పోలీస్‌ శాఖకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.

పలువురి అభినందనలు

నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ సత్యనారాయణను మార్కాపురం సబ్‌ డివిజన్‌ పరిధిలోని పలువురు సీఐలు, ఎస్సైలు, పోలీస్‌ సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు.