గుడ్లూరు, అక్టోబర్ 7: ఉలవపాడు ప్రాజెక్టు సీడీపీఓ మాధవీలత ఆదేశాల మేరకు గుడ్లూరు మండలంలోని తెట్టు సెక్టార్ పరిధిలోని పొట్లూరు వన్ అంగన్వాడీ కేంద్రంలో 9వ పోషణ మహా మాస ఉత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, ఇతర తల్లులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు.
రోజువారీ ఆహారంలో పోషక విలువలు కలిగిన ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు, పాల పదార్థాలు, చిరుధాన్యాలు, సజ్జలు, జొన్నలు, రాగులు తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు. ఆకుకూరలను ఎక్కువగా వినియోగించడంతో పాటు ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలని తెలిపారు. ప్రాంతీయంగా లభించే పోషక విలువలున్న వంటకాలపై కూడా అవగాహన కల్పించారు.
ఆహారంలో వైవిధ్యం ఉండేలా చూసుకోవాలని, పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే తాజా భోజనం, పోషకాహారం ప్రాధాన్యతను తల్లులకు వివరించారు. అలాగే గర్భిణులు, బాలింతలకు ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎస్‌కే అమీర్ నిషా, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Social Plugin