మొండి వారిపాలెంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు

 

మొండి వారిపాలెంలో ఘనంగా పోషణ మాసోత్సవాలు..

గుడ్లూరు, సెప్టెంబర్ 29: ఉలవపాడు ప్రాజెక్టు సీడీపీఓ మాధవీలత ఆదేశాల మేరకు గుడ్లూరు మండలంలోని తెట్టు సెక్టార్ పరిధిలోని మొండి వారిపాలెం గ్రామ అంగన్వాడీ కేంద్రంలో 9వ పోషణ మాసోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

కార్యక్రమానికి గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, తల్లులు హాజరయ్యారు. వారికి పౌష్టికాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు మరియు పాల పదార్థాలు, చిరుధాన్యాలు, సజ్జలు, జొన్నలు, రాగులు వంటి పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను చేర్చుకోవాలని సూచించారు.

మునగాకు, కరివేపాకు వంటి ఆకుకూరలను ఎక్కువగా వినియోగించాలని, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాలతో పాటు స్థానికంగా లభించే ఆరోగ్యకరమైన వంటకాలను తీసుకోవాలని తెలిపారు. అధికంగా చక్కెర, ఉప్పు, నూనెతో తయారు చేసే పదార్థాలు, ఐస్‌క్రీమ్ వంటి వాటిని తగ్గించాలని సూచించారు.

గర్భిణులు, బాలింతలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పోషణ్ అభియాన్ కింద సేవలపై కూడా అవగాహన కల్పించారు. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) పథకం కింద అర్హులైన గర్భిణులు, బాలింతలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. పథకం నిబంధనల ప్రకారం మొదటి బిడ్డకు రూ.6,000, రెండో బిడ్డకు రూ.5,000 వరకు ఆర్థిక సహాయం అందుతుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలు, తల్లులు పాల్గొన్నారు.